Site icon NTV Telugu

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నాదల్‌కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో​పాల్గొని నాదల్ తన స్వదేశం స్పెయిన్‌కు​చేరుకున్నాడు. ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో ఇతడికి కరోనా సోకినట్లు స్పష్టమైంది.

https://ntvtelugu.com/australia-won-by-275-runs-in-ashes-second-test/

దీంతో ‘నేను కొంత బాధలో ఉన్నాను. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతానని అనుకుంటున్నాను. నాతో క్లోజ్‌గా ఉన్న వారందరూ కరోనా టెస్టులు చేయించుకోండి’ అంటూ నాదల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం రఫెల్ నాదల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నాదల్ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు.

Exit mobile version