Site icon NTV Telugu

Serena Williams: రిటైర్‌మెంట్ ప్రకటించిన టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్!

Serena Williams

Serena Williams

Serena Williams: 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత, అమెరికా లెజెండ్‌ సెరెనా విలియమ్స్‌ మంగళవారం టెన్నిస్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. క్రీడల నుంచి తాను దూరమవుతున్నానని పేర్కొంది. టెన్నిస్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్‌ మేగజైన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రిటైర్మెంట్ అనే పదం తనకు ఇష్టం లేదని.. టెన్నిస్‌కు దూరంగా ఉంటూ తనకు ఇష్టమైన విషయాల పట్ల దృష్టి సారిస్తానని సెరెనా విలియమ్స్ వెల్లడించింది. తన కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పుకొచ్చింది.

సెరెనా విలియమ్స్​ ప్రస్తుతం సుదీర్ఘ విరామం తర్వాత.. టోరంటో నేషనల్​ బ్యాంక్​ ఓపెన్‌లో ఆడుతోంది. ఆ తర్వాత సీజన్​ చివరి గ్రాండ్​ స్లామ్​ యూఎస్​ ఓపెన్‌లో ఆడనుంది. ఆగస్టు 29న న్యూయార్క్‌లో ఈ ఈవెంట్​ ప్రారంభం కానుంది. బహుశా తన సొంత దేశంలోనే సెరెనా తన చివరి మ్యాచ్​ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తన మొదటి సింగిల్స్ మ్యాచ్‌లో వింబుల్డన్‌లో పరాజయం పాలైంది. అయితే, ఆమె ఇప్పుడు తన వీడ్కోలు టోర్నమెంట్‌ అయిన యూఎస్‌ ఓపెన్‌పై దృష్టి పెట్టింది.

Shoaib Akhtar Emotional Video: చాలా నొప్పిగా ఉంది.. పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ ఎమోషనల్ వీడియో

ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ద్వారా 319 వారాల పాటు ఆమె సింగిల్స్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను పొందింది. ఇందులో 186 వరుస వారాల ఉమ్మడి రికార్డు కూడా ఉంది. సెరెనా 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ఓపెన్ ఎరాలో అత్యధికంగా ఏ క్రీడాకారిణి సాధించలేదు. ​ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన రికార్డు మార్గరెట్​ కోర్ట్​(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. ఆమె మొత్తం 24 టైటిళ్లు గెల్చుకుంది. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్​ 22 గ్రాండ్‌స్లామ్‌​ టైటిళ్లతో ముందుండగా.. సెర్బియా స్టార్​ నొవాక్​ జకోవిచ్​(21), స్విస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​(20) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Exit mobile version