TPGL: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్, సీజన్ 3 మొదలైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Premier Golf League Season 3 Started: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఈ రోజు సీజన్ 3 ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీ డి.వందిత్ రెడ్డి , నిధి యూనివర్సిటీ చైర్మన్, లీగ్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ కె.టి.మహి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “గోల్ఫింగ్ కమ్యూనిటీ కోసం మరో లీగ్‌ని నిర్వహించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ గోల్ఫ్ లీగ్ ను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం & తెలంగాణా పర్యాటక శాఖ వారు అందించిన మద్దతుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న TPGL తో జంట నగరాల్లో గోల్ఫ్‌పై అవగాహన పెరగటం తో పాటుగా భాగస్వామ్యం కూడా పెరిగింది, లీగ్ లో 16 జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. వారితో పాటుగా స్పాన్సర్‌ల విలువైన సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము” అని అన్నారు.
గౌరవ కార్యదర్శి వందిత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ యొక్క సీజన్ 3 గణనీయమైన రీతిలో 16 జట్ల నుండి ఆసక్తిని పొందింది. నిధి విశ్వవిద్యాలయం మూడవసారి టైటిల్ స్పాన్సర్‌గా తిరిగి వచ్చింది. టీపీజీఎల్‌ను ఈ రోజు అద్భుతమైన విజయంగా మార్చడంలో దోహదపడిన టీమ్ స్పాన్సర్‌లందరి భాగస్వామ్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్ క్రీడాకారులకు గోల్ఫ్ పోటీలో పాల్గొనడానికి మరియు వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది…” అని అన్నారు
16 జట్లు:
1. శ్రీనిధియన్ థండర్‌బోల్ట్స్ (స్పాన్సర్లు : డా. కె.టి. మహీ & డా. జవహర్ మహి)
2. టీమ్ టీ ఆఫ్ (స్పాన్సర్లు 1: సామ్ ఎ చినోయ్ & జె. పి. రెడ్డి)
3. వ్యాలీ వారియర్స్ (స్పాన్సర్ ప్రదీప్ మిట్టల్ )
4. అపోలో క్యాన్సర్ క్రూసేడర్స్ (స్పాన్సర్: డా. పి విజయ్ ఆనంద్ రెడ్డి)
5. MYK స్ట్రైకర్స్ (స్పాన్సర్: మురళి యాదమ)
6. విల్లాజియో హైలాండర్స్ (స్పాన్సర్: శైలేందర్ సింగ్)
7. టీమ్ మైసా (స్పాన్సర్: దీపక్ గుల్లపల్లి)
8. KLR కింగ్స్ (స్పాన్సర్: K లక్ష్మా రెడ్డి)
9. ఆర్య వారియర్స్ (స్పాన్సర్: కల్వకుంట్ల నర్సింగ్ రావు)
10. అవెంజర్స్ (స్పాన్సర్: పెన్మత్స హరి రాజు)
11. ఆటమ్ ఛార్జర్స్ (స్పాన్సర్: మతి నేహా అహ్లువాలియా)
12. డెక్కన్ నవాబ్స్ (స్పాన్సర్: . రవీందర్ నాథ్, . శరత్ చంద్ర కోడూరి, . ప్రేమ్ కుమార్ పోలవరపు)
13. లహరి లయన్స్ (స్పాన్సర్: గడ్డిపాటి సంజయ్ చౌదరి)
14. స్టార్జ్ టీమ్ (స్పాన్సర్: శ్రీనివాసు సత్తి)
15. సెలబ్రిటీ స్టింగర్స్ (స్పాన్సర్: మతి ఐశ్వర్య మాదిరెడ్డి)
16. ఊర్జిత ఈగిల్స్ (స్పాన్సర్: వీర్ ప్రకాష్)
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
TPGL-2023 ప్రారంభం శుక్రవారం అక్టోబర్-06
మొదటి రౌండ్ ఆదివారం అక్టోబర్-08
రెండవ రౌండ్ బుధవారం అక్టోబర్-11
మూడవ రౌండ్ శనివారం అక్టోబర్-14
నాలుగో రౌండ్ బుధవారం అక్టోబర్-18
ఐదవ రౌండ్ శనివారం అక్టోబర్-21
అక్టోబర్-25 బుధవారం ఓపెన్ డే
అక్టోబర్-29 ఆదివారం క్వార్టర్ ఫైనల్స్
సెమీఫైనల్స్ బుధవారం నవంబర్-01
ఫైనల్స్ శనివారం నవంబర్-04
TPGL ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ ఆదివారం నవంబర్-05
దయచేసి సందర్శించండి: https://tpgl.in/ మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి: కళ్యాణ్ చక్రవర్తి @ 9381340098
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!