NTV Telugu Site icon

వైరల్ వీడియో: ‘పుష్ప’ పాటకు డ్యాన్స్ వేసిన టీమిండియా క్రికెటర్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుత స్పందన వచ్చింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా కూడా అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అంటూ ఓ మేనరిజంను ఫాలో అవుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.

Read Also: అచ్చ తెలుగు అందంలో సంక్రాంతి ముద్దుగుమ్మలు

ఇప్పుడు తాజాగా టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా ‘పుష్ప’రాజ్ మాయలో పడిపోయారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు హీరో అల్లు అర్జున్ వేసినట్లు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను స్వయంగా ‘పుష్ప’ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. టీమిండియా యంగ్ క్రికెటర్లు పుష్ప హిందీ వెర్షన్ సాంగ్ డ్యాన్స్ వేయడం ఐకాన్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. కాగా ఇప్పటికే పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.