Site icon NTV Telugu

IND Vs IRE: టీమిండియాదే టాస్.. తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం

Ind Vs Ire

Ind Vs Ire

డబ్లిన్ వేదికగా జరుగుతున్న భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం సృష్టించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈరోజు తొలి టీ20, మంగళవారం రెండో టీ20 జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ద్వారా తమ రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ప్లేయింగ్ ఎలెవన్:
టీమిండియా: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, చాహల్, ఉమ్రాన్ మాలిక్
ఐర్లాండ్: ఆండీ బాల్బిరిన్, పాల్ స్టిర్లింగ్, డిలానే, టెక్టార్, టక్కర్, డోక్రెల్, మార్క్ ఆదిర్, ఆండీ మెక్‌బ్రిన్, క్రెగ్ యంగ్, జోష్ లిటిల్, ఆల్‌ఫర్ట్

Exit mobile version