T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ విధించిన 187 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది. టీమిండియా బౌలర్ షమీ ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక్కడే రాణించాడు. ఫించ్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ (35), మ్యాక్స్‌వెల్ (23) రాణించారు.
Read Also: T20 World Cup: వార్మప్ మ్యాచ్‌లో రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..?
షమీ ఒక్క ఓవర్ వేసినా మూడు వికెట్లతో చెలరేగాడు. అతడి బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ అందుకున్న తీరు అందరినీ అబ్బురపరిచింది. భువనేశ్వర్ రెండు వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు.
