Site icon NTV Telugu

Team India: ఈ జెర్సీతోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్ బరిలోకి దిగేది!

Team India New Jersey

Team India New Jersey

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరగనుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. అయితే 2026 టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు కోసం కొత్త జెర్సీని బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ జెర్సీని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, తెలుగు ప్లేయర్ తిలక్‌ వర్మ ఆవిష్కరించారు.

బుధవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే సందర్భంగా 2026 టీ20 ప్రపంచకప్‌ కోసం జెర్సీని ఆవిష్కరించారు. రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మలు చెరో జెర్సీని ఆవిష్కరించారు. ఇప్పుడున్న జెర్సీ కంటే.. టీ20 ప్రపంచకప్‌ కోసం సిద్ధం చేసిన జెర్సీ కాస్త బిన్నంగా ఉంది. జెర్సీపై నిలువుగా లైన్స్ వచ్చాయి. ఆరెంజ్ కలర్ కూడా అదనంగా ఉంది. కొత్త జెర్సీకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి 7న అమెరికాతో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.

భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్:
ఫిబ్రవరి 7 – భారత్ vs యూఎస్‌ఏ (ముంబై)
ఫిబ్రవరి 12 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్థాన్‌ (కొలంబో)
ఫిబ్రవరి 18 – భారత్ vs నెదర్లాండ్స్‌ (అహ్మదాబాద్)

Exit mobile version