Site icon NTV Telugu

Suryakumar Yadav: సూర్యకుమార్ బ్యాటింగ్పై దృష్టి పెట్టాలి.. స్ట్రైక్ రేట్‌ దారుణంగా ఉంది..

Varun

Varun

Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ప్రస్తుతం పెద్ద ఆందోళనగా మారింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో సూర్య కేవలం 29 పరుగులే చేశాడు. ఈ సిరీస్ లో అతడి సగటు 9.67 మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చివరి టీ20కి ముందు మాజీ భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ యాదవ్ కు ఇప్పుడు అత్యవసరంగా పరుగులు కావాలని అన్నారు. సూర్య బ్యాట్ నుంచి రన్స్ వస్తే అతని ఆత్మవిశ్వాసంలో భారీ మార్పు కనిపిస్తుందని పేర్కొన్నాడు. అదే శుభ్‌మన్ గిల్ విషయంలోనూ వర్తిస్తుందని చెప్పాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్ రాబోతుంది, కాబట్టి ఈ ఇద్దరూ భారత జట్టుకు కీలక బ్యాటర్లు.. వీరూ ఫామ్‌లోకి వస్తే టీమిండియా మరింత బలంగా మారుతుందని వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించారు.

Read Also: Alcohol Affects: ఆల్కహాల్ తాగిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

అయితే, సూర్య కుమార్ యాదవ్ పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కాదని మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ స్పష్టం చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య 165 పరుగులు చేసి, సగటు 41.25, స్ట్రైక్ రేట్ 139.83తో ఆకట్టుకున్నాడని గుర్తు చేశారు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో అతడు మళ్లీ తన గత ఫామ్‌ను అందుకుంటాడని తెలిపాడు. అలాగే, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా 83 శాతం విజయశాతం కలిగి ఉన్నాడని చెప్పుకొచ్చాడు. సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత కూడా జట్టును విజయపథంలో నడిపించగలిగాడంటే, అతనికి కో- ప్లేయర్స్ విశ్వాసం ఉందని స్పష్టం అవుతోంది.. ప్రస్తుతం సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోయినా, సరైన సమయంలో అతడు తప్పకుండా రాణిస్తాడని వరుణ్ ఆరోన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version