Suryakumar Yadav: సూర్యకుమార్ బ్యాటింగ్పై దృష్టి పెట్టాలి.. స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది..
- ఆందోళనకరంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..
- సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో కేవలం 29 పరుగులు మాత్రమే చేసిన సూర్య..
- వరల్డ్ కప్ లోపు గిల్, సూర్య ఫాంలోకి వస్తే భారత్ కు తిరుగుండదు: మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ప్రస్తుతం పెద్ద ఆందోళనగా మారింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో సూర్య కేవలం 29 పరుగులే చేశాడు. ఈ సిరీస్ లో అతడి సగటు 9.67 మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చివరి టీ20కి ముందు మాజీ భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ కు ఇప్పుడు అత్యవసరంగా పరుగులు కావాలని అన్నారు. సూర్య బ్యాట్ నుంచి రన్స్ వస్తే అతని ఆత్మవిశ్వాసంలో భారీ మార్పు కనిపిస్తుందని పేర్కొన్నాడు. అదే శుభ్‌మన్ గిల్ విషయంలోనూ వర్తిస్తుందని చెప్పాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్ రాబోతుంది, కాబట్టి ఈ ఇద్దరూ భారత జట్టుకు కీలక బ్యాటర్లు.. వీరూ ఫామ్‌లోకి వస్తే టీమిండియా మరింత బలంగా మారుతుందని వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించారు.
Read Also: Alcohol Affects: ఆల్కహాల్ తాగిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
అయితే, సూర్య కుమార్ యాదవ్ పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కాదని మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ స్పష్టం చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య 165 పరుగులు చేసి, సగటు 41.25, స్ట్రైక్ రేట్ 139.83తో ఆకట్టుకున్నాడని గుర్తు చేశారు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో అతడు మళ్లీ తన గత ఫామ్‌ను అందుకుంటాడని తెలిపాడు. అలాగే, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా 83 శాతం విజయశాతం కలిగి ఉన్నాడని చెప్పుకొచ్చాడు. సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత కూడా జట్టును విజయపథంలో నడిపించగలిగాడంటే, అతనికి కో- ప్లేయర్స్ విశ్వాసం ఉందని స్పష్టం అవుతోంది.. ప్రస్తుతం సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోయినా, సరైన సమయంలో అతడు తప్పకుండా రాణిస్తాడని వరుణ్ ఆరోన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి