Site icon NTV Telugu

IND Vs NZ: సూర్యకుమార్ సెంచరీ.. సౌథీ హ్యాట్రిక్.. గెలుపు ఎవరిదో?

Suryakumar Yadav

Suryakumar Yadav

IND Vs NZ: మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ (6) తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 36 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్యా (13) కూడా పెద్దగా రాణించలేదు. అయితే కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

Read Also: PSLV-54: శనివారం నింగిలోకి పీఎస్ఎల్వీ-54.. ఓషన్‌శాట్-3 శాటిలైట్ ప్రయోగం

అటు చివరి ఓవర్‌లో కూడా సూర్యకుమార్‌కు స్ట్రైకింగ్ వచ్చి ఉంటే టీమిండియా స్కోరు 200 దాటి ఉండేది. అయితే చివరి ఓవర్లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ సౌథీ బెంబేలెత్తించాడు. వరుసగా హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాష్టింగ్టన్ సుందర్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో సౌథీకి ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. మిగిలిన బౌలర్లలో ఫెర్గుసన్ 2 వికెట్లు సాధించగా, ఇష్ సోథీ ఒక వికెట్ తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 192 పరుగులు చేయాలి. మరి భారత బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.

Exit mobile version