NTV Telugu Site icon

Team India: 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా

టీమిండియా 15 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో చివరి 5 ఓవర్లలో భారత్ అత్యధిక పరుగులు చేసింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో చివరి 5 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ చూడముచ్చటైన షాట్లతో అలరించి జట్టుకు భారీ స్కోరు అందించారు.

కాగా 2007లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 80 పరుగులు, 2019లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 77పరుగులు, 2010లో గ్రాస్ ఐస్‌లెట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 75 పరుగులు, 2012లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 74 పరుగులను చివరి 5 ఓవర్లలో టీమిండియా పరుగులు సాధించింది. 2007 తర్వాత సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులను రాబట్టింది.