దక్షిణాఫ్రికాతో జూన్ 9 నుంచి సొంతగడ్డపై జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌లకు చాలాకాలం తర్వాత టీమిండియాలో స్థానం లభించింది.
హార్డిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. దినేష్ కార్తీక్ ఆర్సీబీ తరఫున చాలా మ్యాచ్‌లలో ఫినిషర్ పాత్రను పోషించాడు. వీరిద్దరితో పాటు యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రుతురాజ్ గైక్వాడ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
టీమిండియా జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్డిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ , ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.