NTV Telugu Site icon

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా ఆల్‌టైమ్ రికార్డు.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!

Andries Gous, Aaron Jones

Andries Gous, Aaron Jones

Highest targets succesfully chased in T20 World Cups: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టించింది. పొట్టి టోర్నీ చరిత్రలో మూడో అత్యధిక ఛేదన సాధించిన జట్టుగా యూఎస్ చరిత్రకెక్కింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ రికార్డు యూఎస్ ఖాతాలో చేరింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. యూఎస్ విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో 7×4, 3×6), ఆరోన్ జోన్స్ (94; 40 బంతుల్లో 4×4, 10×6) కీలక పాత్ర పోషించారు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఛేదన చేసిన జట్టుగా ఇంగ్లండ్ ఉంది. 2016లో వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాపై 230 పరుగుల టార్గెట్ ఛేదించింది. 2007లో జోబర్గ్ వేదికగా వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 206 రన్స్ ఛేదించింది. తాజాగా కెనడాపై యూఎస్ 195 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఈ రికార్డు టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు. ఇక యూఎస్ఏ తరఫున అత్యధిక భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లో నమోదైంది. అమెరికా తరఫున ఏ వికెట్‌కైనా జోన్స్-గోస్ సాధించిన 131 పరుగులే అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు ఈ రికార్డు మోడానీ-గజనాధ్ (110) పేరిట ఉంది.

Also Read: Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్‌ (వీడియో)!

టీ20లలో అత్యధిక లక్ష్యాన్ని యూఎస్ ఈ మ్యాచ్‌లోనే ఛేదించింది. అంతకుముందు 2024లోనే కెన్ హ్యూస్టన్‌లో 169 రన్స్ ఛేదించింది. 2022లో 155 రన్స్, 2024లో 154 పరుగులను యూఎస్ ఛేదించింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఓవర్ రన్ రేటుతో పరుగులు సాధిస్తూ.. సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా ఆరోన్ జోన్స్-ఆండ్రీ నిలిచారు. వీరిద్దరు 14.29 రన్‌ రేటుతో పరుగులు చేశారు.

Show comments