Site icon NTV Telugu

T20 World Cup 2026 ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ రేస్‌లో ఉంది వీరే .. భారత్‌ నుంచి ఒకేఒక్కడు.. బుమ్రాకు దక్కని చోటు..!

Player Of The Tournament No

Player Of The Tournament No

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌ కప్‌ 2026 ఫైనల్‌కు ముందే అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్ల పేర్లు ప్రకటించింది.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు కోసం ఎనిమిది మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క ఆటగాడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. అతడే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌.. టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లలో అతని అద్భుతమైన బ్యాటింగ్ భారత జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.

ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్‌లో ఉన్న ఆటగాళ్లపై ఆసక్తి పెరిగింది.

1. విల్ జాక్స్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్‌ జాక్స్‌ ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అతను బ్యాట్‌తో 226 పరుగులు చేయడంతో పాటు బంతితో 9 వికెట్లు తీసుకున్నాడు. 176.56 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

2. లుంగి న్గిడి (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి న్గిడి.. ఏడు మ్యాచ్‌లలో 12 వికెట్లు పడగొట్టి జట్టుకు ప్రధాన బౌలర్‌గా నిలిచాడు. 15.58 సగటు మరియు 7.19 ఎకానమీ రేట్‌తో అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు కలిగించాడు.

3. ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రామ్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 286 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. 47.66 సగటు మరియు 165.31 స్ట్రైక్ రేట్‌తో అతను స్థిరమైన ప్రదర్శన ఇచ్చాడు.

4. రాచిన్ రవీంద్ర (న్యూజిలాండ్): న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రవీంద్ర ఈ టోర్నమెంట్‌లో బౌలింగ్‌తో మంచి ప్రభావం చూపాడు. ఎనిమిది మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసుకోవడంతో పాటు 128 పరుగులు కూడా చేశాడు.

5. షాడ్లీ వాన్ షాల్క్‌వైక్ (అమెరికా): అమెరికా ఫాస్ట్ బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌వైక్ ఈ టోర్నమెంట్‌లో అతిపెద్ద సర్ప్రైజ్‌గా నిలిచాడు. కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే 13 వికెట్లు తీసి తన ప్రతిభను చూపించాడు.

6. టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సీఫెర్ట్‌.. ఏడు ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేసి జట్టుకు కీలకంగా నిలిచాడు. 45.66 సగటు మరియు 161.17 స్ట్రైక్ రేట్‌తో నిలకడగా పరుగులు సాధించాడు.

7. సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్తాన్): పాకిస్తాన్ ఓపెనర్ సాహిద్ జాదా ఫర్హాన్‌ ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 383 పరుగులు చేసి రెండు సెంచరీలు సాధించాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో విరాట్‌ కోహ్లీ పేరిట ఉండేది.

8. సంజు సామ్సన్ (భారత్): భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ Sanju Samson నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 232 పరుగులు చేసి 77.33 సగటు, 201.73 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్‌లో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి..

Exit mobile version