NTV Telugu Site icon

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ రూ. 93.80 కోట్లు.. విజేత భారత్‌కు ఎంతంటే?

T20 World Cup 2024 Prize Money

T20 World Cup 2024 Prize Money

T20 World Cup 2024 Prize Money India: టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11 ఏళ్ల తర్వాత భారత్‌ ఖాతాలో ఐసీసీ ట్రోఫీ చేరింది. టీమిండియా చివరిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు ధోనీ సారథ్యంలోనే 2011 వన్డే ప్రపంచకప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

విశ్వవిజేతగా నిలిచిన భారత్‌కు రూ. 20.50 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు రూ. 10.60 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనలిస్టులు ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌కు చెరో రూ. 6.50 కోట్లు.. సూపర్‌-8కు చేరిన ఒక్కో టీమ్‌కు రూ. 2 కోట్లు దక్కాయి. 13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ ఇచ్చింది. ఇక విజయం సాధించిన ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ. 26 లక్షలు దక్కుతాయి. టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రైజ్‌మనీ మొత్తం విలువ రూ. 93.80 కోట్లు.

ప్రైజ్‌మనీ డీటెయిల్స్:
విజేత: భారత్‌కు రూ. 20.50 కోట్లు
రన్నరప్‌: దక్షిణాఫ్రికాకు రూ. 10.60 కోట్లు
సెమీ ఫైనలిస్టులు: ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌కు రూ. 6.50 కోట్లు
సూపర్‌-8 చేరిన టీమ్స్ (12 జట్లు): ఒక్కో టీమ్‌కు రూ. 2 కోట్లు
13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్లు
ప్రతి మ్యాచ్‌ విజయంకు రూ. 26 లక్షలు
టీ20 ప్రపంచకప్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.80 కోట్లు

 

Show comments