Rohit Sharma: ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బౌండరీ లైన్ అవతలికి పంపించేశాడు. మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు సాధించి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
KCR: ఆ కేసు కొట్టివేయాలి.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (Rohit Sharma) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టి20 ఫార్మటులో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. అది కూడా 200 మార్కును దాటిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ తర్వాత ఈ లిస్టులో 173 సిక్సర్లతో న్యూజిలాండ్ ఆటగాడు గప్టిల్, ఆ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జొస్ బట్లర్ 137, ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ 133, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ నికోలస్ పురన్ 132, ఆ తర్వాత టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ 129 సిక్సర్లతో ఉన్నారు.
Ananya Nagalla : సైబర్ మోసగాళ్ల వలలో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..