పాకిస్తాన్ జట్టు పై ఇండియా గెలిచి ఉంటే ఇలాగే చెబుతారా? అంటూ ఢిల్లీ సీఎంను రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పాక్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటి ఘోర ఓటమితో 45 ఏళ్ళ పాటు కొనసాగిన రికార్డు చెరిగిపోయింది. దీంతో క్రికెట్ ప్రియులు కోహ్లీ సేన పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ స్పోర్ట్స్ అన్నాక గెలుపు, ఓటమి సహజమని, పాక్ పై ఓడిపోయినందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ఈ పీడకలను మరచిపోయి ప్రపంచ కప్ ఫైనల్ లో గెలవడానికి ముందుకు సాగాలి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ‘పాక్ జట్టుపై గెలిస్తే పాకిస్తాన్ కు కూడా అలాగే చెప్పేవారా ?’ అంటూ సెటైర్ వేసాడు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు దీనిపై తమ స్పందన తెలియజేస్తూ రకరకాలుగా రిప్లై ఇస్తున్నారు.
Read Also : ప్రియుడితో రకుల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్… పాపులర్ జ్యోతిష్యుడి జోస్యం