Nicholas Pooran overtakes Chris Gayle: టీ20ల్లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు 91 టీ20 మ్యాచ్‌ల్లో 25.52 సగటు, 134.03 స్ట్రైక్ రేట్‌తో 1914 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 82.
Also Read: Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును నికోలస్ పూరన్ బ్రేక్ చేశాడు. గేల్ 79 ఇన్నింగ్స్‌లో 1,899 పరుగులు చేశాడు. గేల్ 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 112. గేల్ బ్యాటింగ్ సగటు 27.92 కాగా.. స్ట్రైక్ రేట్ 137.50గా ఉంది. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ఉన్నాడు. 122 మ్యాచ్‌ల్లో 4113 రన్స్ చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (4042), రోహిత్ శర్మ (4042), పాల్ స్టిర్లింగ్ (3600), మార్టిన్ గప్తిల్ (3531) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.