NTV Telugu Site icon

IND vs ENG : వ‌ర్షం ప‌డి సెమీస్ మ్యాచ్‌ ర‌ద్దైతే..? టీమిండియా నేరుగా..

Rain

Rain

ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గ‌యానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచులకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా.. ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా.. అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్ లో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఏ టీం ఫైనల్ కు చేరుతుందన్న విషయం గురించి చూస్తే..

Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఇదివరకే చాలా మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారింది. దాంతో ప్రపంచ కప్ లో కొన్ని మ్యాచ్లు రద్దు కావడంతో మరికొన్ని మ్యాచ్ లలో ఓవర్లు కుదించి మ్యాచ్ను ఆడించారు. ఇకపోతే టీమిండియా క్రికెట్ అభిమానుల్లో దృష్టి ఇప్పుడు అంతా గ‌యానాలోని వాతావరణం పై పడింది. గురువారం నాడు జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే.. టీమిండియా పరిస్థితి ఏంటో అంటూ కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల ప్రకారం గురువారంనాడు గయానాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90 శాతం దగ్గరగా వర్షం పడే అవకాశం ఉందని., అందులో కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు సూచించారు. అయితే సెమి ఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డేను ఇవ్వలేదు.

INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ

ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే నాలుగు గంటల పది నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా మ్యాచ్ జరగలేదంటే రద్దు చేసేస్తారు. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ కు చేరుకున్న రెండు జట్లలో సూపర్ 8 స్టేజిలో ఎవరైతే మెరుగు ప్రదర్శన చేసి ఉంటారో.. ఆ జుట్టు నేరుగా ఫైనల్ గా చేరుకుంటుంది. దీంతో సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ కంటే టీమిండియా మెరుగు ప్రదర్శన చేసింది. కాబట్టి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిన టీమిండియా నేరుగా ఫైనల్ లో చోటు సంపాదించుకుంటుంది. కాబట్టి భారత అభిమానులు వర్షం పడుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. నిజానకి ఈ విషయం తెలిసిన చాలామంది ఖచ్చితంగా వర్షం కులవాలని కోరుకుంటున్నారు.