Site icon NTV Telugu

దుమ్ములేపిన టీమిండియా..ఆఫ్ఘన్‌ ముందు భారీ లక్ష్యం

టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా… బ్యాటింగ్‌ లో దుమ్ములేపింది. ఆరంభం నుంచి 20 ఓవర్ల వరకు ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఆడారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు.

దీంతో 20 ఓవర్ల లో కేవలం రెండు వికెట్లు కోల్పోయి… ఏకంగా 210 పరుగులు చేసింది టీమిండియా. కేఎల్‌ రాహుల్‌ 69 పరుగులు, రోహిత్‌ శర్మ 74 పరుగులు, రిషబ్‌ పంత్‌ 27 నాటౌట్‌, హర్ధిక్‌ పాండ్యా 35 పరుగు చేసి.. జట్టుకు భారీ స్కోర్‌ ను అందించారు. ఇక 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు.. 211 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరికాసేపట్లోనే.. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం కానుంది.

Exit mobile version