ఇవాళ న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్ గెలుస్తుందా? భారత్ సెమీస్ ఆశలు నిలుస్తాయా? సగటు భారత అభిమాని ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కివీస్ చేతిలో అఫ్గాన్ ఓడితే టీమిండియా సెమీస్ అశలు గల్లంతైనట్లే. టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇప్పుడు మరో ప్రత్యర్థి జట్టు గెలవాలనునే పరిస్థితి వచ్చింది. పాక్, కివీస్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్ సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో అఫ్గాన్, స్కాట్లాండ్‌పై విజయంతో పాటూ మంచి రన్ రేట్ కూడా సాధించిన కోహ్లీసేన.. అభిమానుల్లో సెమీస్ ఆశలను సజీవంగా నిలిపింది.
8 పాయింట్లతో గ్రూప్ 2 పట్టికలో టాప్‌లో ఉన్న పాకిస్తాన్ కంటే కూడా భారత్ రన్ రేటే ఎక్కువగా ఉంది. స్కాట్లాండ్‌ను 85 పరుగులకు కట్టడి చేయడంతోపాటూ ఏడు ఓవర్లలోపే లక్ష్యాన్ని అందుకున్న భారత్.. 1.679 రన్ రేట్ సాధించింది. ఇప్పుడు భారత్ మాత్రమే కాదు.. క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ ఇవాళ జరగబోయే అఫ్గానిస్తాన్- న్యూజీలాండ్ మ్యాచ్ మీదే ఉన్నాయి. ఆఫ్గాన్ విజయం కోసం భారత అభిమానులు ప్రార్థిస్తున్నారు. భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే న్యూజీలాండ్ కచ్చితంగా అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోవాలి. అదే సమయంలో భారత్ నమీమియాపై గెలవాలి. అదే జరిగితే రన్ రేట్ ద్వారా టీమిండియా సెమీస్‌కు చేరుతుంది. అఫ్గాన్ ఓడితే మాత్రం కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే.
