Lockie Ferguson Creates History in T20 World Cup: న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లోనే అత్యంత పొదుపుగా (అత్యుత్తమ ఎకానమీ) బౌలింగ్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పసికూన పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.. మూడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్ అరుదైన ఫీట్ సాధించాడు.
టీ20 చరిత్రలో లాకీ ఫెర్గూసన్ కంటే ముందు కెనడా కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ అత్యుత్తమ ఎకానమీ నమోదు చేశాడు. 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 2 వికెట్స్ తీశాడు. ఫెర్గూసన్ మాత్రం 3 వికెట్లు పడగొట్టాడు. జాఫర్ తర్వాత నాలుగుకు నాలుగు ఓవర్లూ మెయిడెన్లు వేసిన రెండో బౌలర్‌గా ఫెర్గూసన్ నిలిచాడు. వీరిద్దరు తప్ప మరే బౌలర్ కూడా టీ20 క్రికెట్లో ఈ ఫీట్ అందుకోలేదు.
Also Read: TG Budget-2024: నేటి నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు..
పాపువా న్యూగినీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బంతిని అందుకున్న లాకీ ఫెర్గూసన్.. తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్లోని మిగతా ఐదు బంతులను డాట్స్ చేసి మెయిడిన్ చేశాడు. ఏడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 12వ ఓవర్ రెండో బంతికి వికెట్ తీసి.. మరో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్‌లో రెండో బంతికి వికెట్ తీసి.. మరోసారి మెయిడిన్ చేశాడు. అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఫెర్గూసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.