T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!

  • టీ20 వరల్డ్‌కప్ 2026కి ప్రపంచవ్యాప్తంగా స్పందన
  • 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్
  • భారత్ పాల్గొన్న మ్యాచ్‌కు అత్యధిక వ్యూయర్‌షిప్‌
Icc T20 Wc 2026 Jio Hotstar Views

Icc T20 Wc 2026 Jio Hotstar Views

Jio Hotstar T20 WC 2026 Views: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026కి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌లకు జియో హాట్‌స్టార్‌లో మొత్తం 875 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే.. మెగా టోర్నీపై ఎంత క్రేజ్‌ ఉందో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ పాల్గొన్న మ్యాచ్‌లు అత్యధిక వ్యూయర్‌షిప్‌ను నమోదు చేయడం విశేషం. మూడింటిలో ఓ వంతు వ్యూయర్‌షిప్‌ టీమిండియా ఆడిన మ్యాచ్‌కే వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

వ్యూస్ పరంగా టాప్ స్థానంలో భారత్ vs అమెరికా మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఏకంగా 260 మిలియన్ మంది వీక్షించారు. రెండో స్థానంలో పాకిస్థాన్ vs అమెరికా మ్యాచ్ ఉండగా.. 91 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. 86 మిలియన్ వ్యూస్‌తో ఇంగ్లండ్ vs వెస్టిండీస్ మ్యాచ్ మూడో స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ 68 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. శ్రీలంక vs ఐర్లాండ్ మ్యాచ్ 58 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది.

Also Read: PSL 2026 Auction: అత్యంత ఖరీదైన ఆటగాడు నసీమ్ షా.. టాప్-5 లిస్టులో డేవిడ్ వార్నర్!

మిగతా మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా vs కెనడా (52M), నేపాల్ vs ఇంగ్లండ్ (49M), న్యూజిలాండ్ vs అఫ్గానిస్థాన్ (41M), పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ (40M), వెస్టిండీస్ vs స్కాట్లాండ్ (31M), ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ (29M), న్యూజిలాండ్ vs యూఏఈ (27M), స్కాట్లాండ్ vs ఇటలీ (16M), జింబాబ్వే vs ఒమాన్ (14M), నమీబియా vs నెదర్లాండ్స్ (13M) వరుసగా ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఎంతగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్‌లకు భారీగా వ్యూయర్‌షిప్ రావడం వల్ల టోర్నీకి మరింత హైప్ ఏర్పడింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రికెట్ వీక్షణ పెరుగుతున్నదానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వ్యూయర్‌షిప్‌లో రికార్డు నెలకొల్పనుంది.