Site icon NTV Telugu

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు అద్భుత రికార్డు.. గ్రేటెస్ట్ టీ20 టీమ్ ఆఫ్ ఆల్ టైమ్!

T20 World Cup 2026 India

T20 World Cup 2026 India

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లు, సాధించిన విజయాలు చూస్తే.. టీ20 ఫార్మాట్‌లో భారత్ ఎంత స్థిరమైన జట్టో ఇట్టే అర్థమవుతుంది. గణాంకాల పరంగా చూస్తే.. పొట్టి వరల్డ్‌కప్‌లో భారత్‌నే అత్యుత్తమ జట్టు. భారత్ ఇప్పటివరకు మొత్తం 53 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 15 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మరో 2 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ 70.5గా ఉంది. ఇది పొట్టి వరల్డ్‌కప్‌లో పాల్గొన్న అన్ని జట్లలోనే అత్యధికం కావడం విశేషం. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా కూడా టీమిండియా రికార్డు సృష్టించింది. టైటిల్స్ పరంగా కూడా మంచి స్థానంలో ఉంది. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత్.. 2024లో మరోసారి ట్రోఫీని సొంతం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు 2014లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. 2016, 2022ల్లో సెమీఫైనల్స్‌కు చేరింది. దాదాపు ప్రతి ఎడిషన్‌లోనూ నాకౌట్ దశకు చేరడం భారత్ స్థిరత్వానికి నిదర్శనం.

Also Read: Sanju Samson: ముంచుకొస్తున్న ముప్పు.. సంజు శాంసన్‌కు ఇదే చివరి ఛాన్స్‌!

ఈ గణాంకాలన్నీ చూస్తే.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్‌ను ‘గ్రేటెస్ట్ T20I టీమ్ ఆఫ్ ఆల్ టైమ్’గా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ ప్లేయర్లు, యువ టాలెంట్, బలమైన బెంచ్ స్ట్రెంత్‌తో భారత్ ప్రతి టోర్నీలోనూ టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. రాబోయే ఎడిషన్లలో కూడా ఈ రికార్డులు మరింత మెరుగవనున్నాయి. టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈసారి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా.. భారత్ టైటిల్ ఫేవరేట్‌గా ఉంది.

Exit mobile version