Site icon NTV Telugu

T20 World Cup Final: పాకిస్తాన్ అభిమానిపై తెగ మీమ్స్.. చూస్తే నవ్వాపుకోలేరు..

Memes On Pakistan Fan

Memes On Pakistan Fan

T20 WC Final, Memes on Pak fan: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. మరోసారి టీ20 ఛాంపియన్ గా నిలిచింది. అయితే క్రికెట్ ను అమితంగా ఇష్టపడే పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టు అద్భుతం సృష్టిస్తుందని అనుకున్న ఆ దేశ అభిమానులకు నిరాశే ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ బౌలర్లు కళ్లెం వేశారు. 8 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19 ఓవర్లలోనే ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుచుకుంది. ఫైనల్ పోరులో బెన్ స్టోక్స్ అద్భుత ఇన్సింగ్స్ తో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Read Also: Thieves Molested Wife: దారుణం.. దొంగతనానికి వచ్చి, భర్త ముందే భార్యపై అత్యాచారం

అదృష్టం కొద్ది ఫైనల్ కు చేరుకున్న పాకిస్తాన్ కప్ గెలుస్తుందని సగటు పాక్ అభిమాని భావించాడు. అయితే ఓటమితో తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉంటే ఇప్పుడో పాక్ అభిమానిపై విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్సింగ్స్ 19వ ఓవర్ లో సామ్ కర్రన్ బౌలింగ్ లో మొహమ్మద్ నవాజ్ వికెట్ పడుతుంది. ఆ సమయంలో కెమెరా ఓ పాకిస్తాన్ అభిమాని నిరాశను క్యాప్చర్ చేసింది. ప్రస్తుతం ఆ పాకిస్తాన్ అభిమాని మీద తెగ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.

గతంలో 2019 వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో తలపడుతున్న సమయంలో డేవిడ్ వార్నర్ కి పాక్ ఆటగాడు ఆసిఫ్ అలీ ఓ లైఫ్ ఇస్తాడు. ఆ సమయంలో నిరాశ చెందిన పాక్ అభిమాని ఫోటో, నిరాశతో కూడిన అతడి హావభావాలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ మీమర్స్ చాలా సందర్భాల్లో ఆ పాక్ అభిమాని ఫోటోను వాడుతుంటారు. తాగా మరో పాకిస్తాన్ అభిమానిపై తెగ మీమ్స్ వస్తున్నాయి. కొత్తగా పాకిస్తాన్ అభిమాని ఫేస్ ను మీమ్స్ గా వాడుకుంటున్నారు.

https://twitter.com/mattpedigo/status/1591750708520693764

 

Exit mobile version