Suryakumar Yadav named ICC Mens Cricketer of the Year: మిస్టర్ 360 డిగ్రీగా అవతరించిన సూర్యకుమార్ యాదవ్.. గతేడాదిలో ఎలా విజృంభించాడో అందరికీ తెలుసు. తనకు అవకాశం దొరికిన ప్రతీసారి.. పరుగుల వర్షం కురిపించాడు. అర్థసెంచరీలు, సెంచరీలతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఎంతటి కష్టమైన బంతులు వేసినా సరే.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. కొన్ని షాట్స్ అయితే క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఎన్నో రికార్డుల్ని బద్దలు కొట్టాడు. కొన్ని కొత్త రికార్డుల్ని సృష్టించాడు. పలు అవార్డుల్ని కూడా అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నాడు.
Bandi Sanjay : పరేడ్ గ్రౌండ్‌లోనే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
2022 సంవత్సరానికి గాను ఐసీసీ మెన్స్ అంతర్జాతీయ టీ20 విభాగంలో సూర్యకుమార్ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. 2022లో కేవలం 31 మ్యాచులు ఆడిన సూర్య.. 46.56 సగటు, 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్‌లో ఒక ఏడాదిలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా సూర్య నిలిచాడు. అందులో రెండు శతకాలతో పాటు తొమ్మిది అర్థశతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో సూర్య 68 సిక్సులు, 106 ఫోర్లు బాదాడు. ఒక ఏడాదిలో ఇన్ని సిక్స్‌లు బాదిన ఆటగాడు సూర్యకుమార్ ఒక్కడే. తద్వారా.. టీ20 చరిత్రలో ఒక ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా సూర్యకుమార్ సరికొత్త సంచలనం సృష్టించాడు. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే!
US JD Sues Google: భారత్ తరహాలోనే.. అమెరికాలోనూ గూగుల్‌కి ఇక్కట్లు