NTV Telugu Site icon

Surya Kumar Yadav: సూర్యకుమార్ విధ్వంసం.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ బ్రేక్

Surya Breaks Babar Record

Surya Breaks Babar Record

Suryakumar Yadav Breaks Babar Azam Record: ఆదివారం (20-11-20) న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఎలా విజృంభించాడో అందరికీ తెలుసు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే.. కివీస్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా సరే, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో.. 51 బంతుల్లోనే ఇతడు 7 సిక్స్‌లు, 11 ఫోర్ల సహాయంతో 111 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డ్‌ని బద్దలు కొట్టి, సూర్య ఒక అరుదైన ఫీట్ సాధించాడు.

అంతర్జాతీయ టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ సాధించిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఈ ఏడాదిలో సూర్య ఇప్పటివరకు 11 సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించాడు. ఇంతకుముందు బాబర్ ఆజం 10 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజా సెంచరీతో ఆ రికార్డ్‌ని సూర్య బ్రేక్ చేశాడు. అయితే.. ఈ జాబితాలో అగ్రస్థానంలో పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నాడు. 2021 ఏడాదిలో అతడు 13 సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించాడు. ఈ ఏడాదిలో సూర్యకి ఇంకా పలు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లలోనూ ఈరోజులాగే చెలరేగి, పరుగుల వర్షం కురిపించగలిగితే.. రిజ్వాన్ రికార్డ్‌ని బ్రేక్ చేయగలడు. మరి, ఈ ఫీట్‌ని సూర్య సాధిస్తాడా? లేదా? అనేది చూడాలి.

కాగా.. సూర్యకు టీ20ల్లో ఇది రెండో శతకం. అంతకుముందు అతడు ఇంగ్లండ్‌పై తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో సూర్య ‘ఆసియా కప్’తో పాటు టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీలోనూ మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా.. వరల్డ్‌కప్ టోర్నీలో అయితే చెలరేగాడు. మొత్తం టోర్నీలో అతడు మూడు అర్థశతకాలతో 239 పరుగులు సాధించాడు.