న్యూజిలాండ్ ను ఈ మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వైట్ వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 25 న మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులోకి మరో ఆటగాడిని తీసుకోబుతుంది బీసీసీఐ అని ఓ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం భారత జట్టులో మంచి టచ్ ఉన్న ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకడు. అయితే అతడిని కివీస్ తో జరిగే రెడ్-బాల్ సిరీస్ కోసం భారత జట్టులోకి తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది.
అయితే ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ యూఏఈ లో ప్రారంభం కాకముందు టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ తో తలపడిన భారత జట్టులో సూర్యకుమార్ కూడా ఉన్నాడు. కానీ అతనికి తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు సూర్యకుమార్ టెస్టు జట్టులోకి మళ్ళీ వస్తున్నాడు అని… అతను కివీస్ తో టెస్ట్ సిరీస్ లో తలపడనున్న భారత జట్టులోకి రానున్నాడు అని సమాచారం. ఇక రెడ్ బల్ క్రికెట్ లో మొత్తం 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ 44 సగటుతో 5,356 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.