NTV Telugu Site icon

Wasim Jaffer : వరల్డ్ కప్ కు సూర్య డౌటే..?

Wasim Jaffer

Wasim Jaffer

టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో మాత్రం తన మార్క్ ను చూపించలేకపోతున్నాడు. టీ20లలో రాణించడంతో అతడికి వన్డే జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా ఈ ఫార్మాట్ లో అతడి ఆట మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సూర్య-నాగ్ పూర్ టెస్టులో విఫలమయ్యాడు.. తాజాగా అదే ఆసీస్ సిరీస్ లోనే దారుణ ప్రదర్శనలతో విమర్శల పాలవుతున్నాడు.

Also Read : Kantara: భూతకోల అరుపు ఇంకా వినిపిస్తూనే ఉంది…

ఆసీస్ తో వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేతో పాటు తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో కూడా సూర్య డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య ఇదే ఆట ఆడితే అతడు ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమేనని చెప్పారు. అసలే భారత్ కు ఈ వన్డే సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ లో మ్యాచ్ లు లేవు అని తెలిపాడు. రాబోయే వన్డేలో కూడా విఫలమైతే అతను వన్డే వరల్డ్ కప్ టీమ్ లో ఉండటం అనుమానమే అని చెప్పాడు.

Also Read :MP Teacher: బాలికలతో అర్ధనగ్న నృత్యాలు వేయించి.. వీడియోలు తీసి బెదిరించాడు.. చివరకు!

కాగా తొలి వన్డేలో ఆసీస్ గెలిచే అవకాశాలున్నా ఆ జట్టు కీలక బౌలర్ స్టార్క్ కు సహకారం అందించే బౌలర్లు లేక కంగారూలు ఓడిపోయారని జాఫర్ అన్నారు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని అందుకే పరుగులు రాకపోవడం గగడనమైందని వసీం జాఫర్ అన్నారు. బంతి స్వింగ్ అవడంతో లెఫ్టార్మ పేసర్ అయిన స్టార్క్ కు వికెట్లు దక్కాయని.. అతడికి సహకారం అందించుంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని జాఫర్ తెలిపాడు.