Site icon NTV Telugu

Suresh Raina Captaincy: ఎంఎస్ ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో.. ఎన్నో కెప్టెన్సీ ఆఫర్లను వదిలేశా: రైనా

Suresh Raina Ms Dhoni Csk

Suresh Raina Ms Dhoni Csk

Suresh Raina Said I Rejected IPL Captaincy Dffers Due to MS Dhoni Advice: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ బ్యాటర్ సురేశ్ రైనాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు చాలా కాలంగా ఆడడంతో.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. రైనాపై ధోనీ ఎంతో నమ్మకం ఉంచేవాడు, మిస్టర్ ఐపీఎల్ కూడా దాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకునేవాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నంతకాలం రైనాకు జట్టులో చోటు పక్కాగా ఉండేది. ధోనీ, రైనా కలిసి భారత్, చెన్నై జట్లకు ఎన్నో విజయాలు అందించారు. వీరిద్దరూ ఒకేరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారంటే.. వారి మధ్య ఉన్న స్నేహంను ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తొలి ఐపీఎల్ టైటిళ్లలో సురేశ్ రైనా కీలక పాత్ర పోషించాడు. అద్భుత బ్యాటింగ్‌తో ‘చిన్న తలా’గా పేరొందాడు. చెన్నై తరఫున ఎంఎస్ ధోనీ, రైనాలు 2021 వరకూ ఆడారు. చెన్నై జట్టులో వైస్‌ కెప్టెన్‌గా రైనా కొనసాగాడు. ధోనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా సేవలు అందించాడు. 2022లో మొదటిసారి రైనాను వేలానికి వదిలేసిన చెన్నై.. తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. మిగతా జట్లు కూడా ‘మిస్టర్ ఐపీఎల్’ను తీసుకోలేదు. ప్రస్తుతం రైనా కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ధోనీతో ఉన్న తనకున్న అనుబంధం గురించి రైనా మరోసారి పంచుకున్నాడు. కెప్టెన్సీ ఆఫర్లు వచ్చినా ధోనీ చెప్పిన ఒక్క మాటతో వదిలేశానని చెప్పుకొచ్చాడు.

Also Read: ODI World Cup 2023: వెస్టిండీస్‌ ప్రపంచకప్ 2023 ఆశలు గల్లంతు.. కొంపముంచిన జింబాబ్వే!

తాజాగా సురేష్ రైనా ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ… ‘దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా చేశా. ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరించా. చెన్నై సస్పెన్షన్‌కు గురైనప్పుడు గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్సీ చేశాను. దాంతో ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్ కెప్టెన్సీ ఆఫర్స్ ఇచ్చాయి. అయితే మహీ భాయ్ మాత్రం జట్టును వీడొద్దని చెప్పాడు. నేను చెన్నైకి కెప్టెన్‌గా ఉన్నన్ని రోజలు నువ్వే వైస్‌ కెప్టెన్‌ అని చెప్పాడు. నేను జట్టులో ఉన్నన్నీ వైస్‌ కెప్టెన్‌గా కొనసాగా. ధోనీ మాట నిలబెట్టుకున్నాడు. ధోనీ కోసం ఆఫర్స్‌ అన్ని వదులుకున్నా’ అని తెలిపాడు.

‘కెప్టెన్ అవ్వాలని ఎప్పుడూ ఆశపడలేదు. ఎప్పుడూ కూడా జట్టు ప్లేయర్‌గానే ఉన్నాను. సహచర ఆటగాళ్లకు సాయం చేయడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కరించడం మాత్రమే నాకు తెలుసు. ఏనాడూ పదవులు కోరుకోలేదు’ అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. 2016లో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. దాంతో రైజింగ్‌ పుణె జట్టుకు ఎంఎస్ ధోనీ, గుజరాత్‌ లయన్స్‌కు రైనా సారథ్యం వహించారు. రైనా 205 ఐపీఎల్ మ్యాచులు ఆడి 5528 రన్స్ చేశాడు.

Also Read: New BCCI Chief Selector: ఢిల్లీ క్యాపిటల్స్‌ పదవికి రాజీనామా.. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌!

Exit mobile version