Site icon NTV Telugu

Suresh Raina: మిస్టర్ ఐపీఎల్‌కు ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు

ఐపీఎల్‌లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అతడు గుర్తుండిపోయేలా ప్రదర్శనలు చేశాడు. అయినా ఈ ఏడాది అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’​ అవార్డుకు రైనా ఎంపిక‌య్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంత‌ర్జాతీయ ఆట‌గాళ్లు పోటీప‌డ‌గా చివ‌ర‌కు సురేష్ రైనాను వ‌రించింది.

ఈ అవార్డు కోసం పోటీ ప‌డిన వారిలో శ్రీలంక క్రికెట్​ దిగ్గజ ఆట‌గాడు సనత్​ జయసూర్య, జమైకా స్ప్రింటర్​పోవెల్, డచ్​ఫుట్‌బాల్​ఆటగాడు ఎడ్గర్​డెవిడ్స్ ఉన్నారు. ఈ అవార్డును రైనాకు బంగ్లాదేశ్​ క్రీడామంత్రి జహీర్ హసన్​ రసెల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. కాగా ఐపీఎల్​వంటి మెగా టోర్నీలో చైన్నై సూపర్​ కింగ్స్ జట్టు నాలుగు సార్లు కప్పు గెలవడంలో సురేష్ రైనా కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్‌లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు.

https://ntvtelugu.com/csk-star-all-rounder-moeen-ali-will-miss-to-play-first-match-of-ipl-2022/
Exit mobile version