Sunil Gavaskar Wants To Comments KS Bharath: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో అంతర్జాతీయ టెస్టుల్లోకి అడుగుపెట్టిన కేఎస్ భరత్.. ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. చివరి టెస్టులో 44 పరుగులు చేసి, మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో తనవంతు పాత్ర పోషించాడు. కీపర్‌గానూ తన సత్తా చాటేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే.. భరత్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం భరత్‌ని తీసుకోవద్దని కుండబద్దలు కొట్టాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ని తీసుకుంటే బెటరని, అభిప్రాయపడ్డాడు.
IND vs AUS ODI Series: టీమిండియాకు భారీ దెబ్బ.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేమర్ దూరం!
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఫైనల్‌లో కేఎల్ రాహుల్‌ని వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఆడించవచ్చు. ఐదు లేదంటే ఆరో స్థానంలో అతడిని ఆడిస్తే.. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. గతేడాది ఇంగ్లండ్‌లో రాహుల్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే నేను ఈ మాట అంటున్నాను. లార్డ్స్‌లో అతడు సెంచరీ సాధించాడు. కాబట్టి.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టును ఎంపిక చేసేటపుడు, కేఎల్ రాహుల్ పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు. తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలను కేఎస్ భరత్ మరింత మెరుగుపరచుకోవాలని, అయితే అతడు తుది జట్టులో ఉంటాడా? లేదా? అన్నది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయమని తెలిపాడు. తన అభిప్రాయం ప్రకారం.. ఇంగ్లండ్ పిచ్‌లపై వికెట్ కీపింగ్ చేయాలంటే, కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞులు అవసరమని అన్నాడు. ఒకవేళ రాహుల్‌కి అవకాశం లేకపోతే.. ఇషాన్ కిషన్ పేరుని కూడా పరిశీలించవచ్చన్నారు. ఎందుకంటే.. భరత్ కంటే ఇషాన్ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు.
Salman Khan: ఆ సమయంలో సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు.. గ్యాంగ్‌స్టర్ బిష్ణోవ్ బాంబ్
ఇలా సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే.. కేఎల్ రాహుల్ చాలాకాలం నుంచి విఫలమవుతూ వస్తున్నాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సైతం అతడు పెద్దగా రాణించింది లేదు. తొలి రెండు టెస్ట్ మ్యాచుల్లో అతడు ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేయనే లేదు. వన్డే, టీ20ల్లోనూ అతడు ఎప్పుడో ఒకసారి మెరుపులు మెరిపిస్తున్నాడే తప్ప.. నిలకడగా రాణించడం లేదు. అయితే.. ఈ టెస్ట్ సిరీస్‌లో కేఎస్ భరత్ మరీ గొప్ప ప్రదర్శన కనబర్చకపోతే, మంచి ఆటతీరుతోనే రాణించగలిగాడు. కీపింగ్, బ్యాటింగ్‌లో తనని తాను నిరూపించుకున్నాడు. ‘‘అలాంటి ఆటగాడ్ని పక్కనపెట్టాలా?’’ అంటూ నెటిజన్లు గవాస్కర్‌ని ట్రోల్ చేస్తున్నారు.