Sunil Gavaskar: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోని ఆటగాళ్లను తరుచూ మాట్లాడటం వల్లనే టీమిండియాకు ఈ గతి పట్టిందన్నాడు. 11మంది ఆటగాళ్లు తరచూ కలిసి ఆడకపోవడంతోనే ఆసియా కప్‌లో స్పీడ్ అందుకోలేకపోయారని.. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులోని ఆటగాళ్లను దక్షిణాఫ్రికా, ఆసీస్‌తో సిరీస్‌లకు ఆడించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆటగాళ్ల ఎంపికలో మ్యూజికల్ ఛైర్స్ ఆడటం వల్ల టీమ్‌కే నష్టం జరుగుతుందన్నాడు.
Read Also: త్వరగా బరువు తగ్గాలంటే ఈ ఆసనాలు ప్రయత్నించండి
ఇప్పటికైనా టీమ్‌లో ప్రయోగాలకు స్వస్తి చెప్పాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆటగాళ్లు కూడా పని ఒత్తిడి గురించి మాట్లాడటం ఆపాలన్నాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లలో ఎక్కువ మందిని జింబాబ్వే పర్యటనకు పంపించి ఉంటే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అలా కాకుండా ఓ నలుగురు ఐదుగురిని ఎంపిక చేశారని.. జింబాబ్వేపై రాణించిన వారికి ఆసియా కప్ తుది జట్టులో మాత్రం స్థానం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. భారత్ తరఫున మాత్రమే ఆడితే వర్క్‌లోడ్ అనేది సమస్య కాదన్నాడు. ఇప్పుడు ఆసియా కప్ నుంచి ముందుగానే వైదొలిగితే అదనంగా మరో మూడు రోజులపాటు రెస్ట్ దొరుకుతుందని.. అప్పుడు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని ఆసీస్‌తో సిరీస్‌కు సన్నద్ధం కావాలని గవాస్కర్ హితవు పలికాడు.
