NTV Telugu Site icon

WTC Final: ఇషాన్ కిషన్‌కి నో ఛాన్స్.. అతనికే చోటు

Ishan Kishan Sunil

Ishan Kishan Sunil

Sunil Gavaskar Gives Chance To KS Bharat In His Playing XI Instead Of Ishan Kishan: ఓవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నెగ్గాలని టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు కసరత్తు చేస్తుంటే.. మరోవైపు భారత జట్టులో వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఇంకా మిస్టరీ వీడలేదు. కీపింగ్ విషయంలో ఇద్దరూ బెటర్ ఆప్షన్ అయినా.. బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎక్కువ ఓట్లు ఇషాన్‌కే పడుతున్నాయి. భరత్‌తో పోలిస్తే ఇషాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలడని, మైదానంలో పరుగుల వర్షం కురిపించగలడని.. క్రీడా విశ్లేషకులతో పాటు చాలామంది మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఫైనల్ ప్లెయింగ్ ఎలెవెన్‌లో ఇషాన్‌కే చోటు ఇవ్వాలని సెలెక్టర్లను సూచిస్తున్నారు. ఒకవేళ అతడ్ని కాదని భరత్‌ని తీసుకుంటే మాత్రం.. ఒక మంచి బ్యాటర్‌ని కోల్పోతామని కూడా హెచ్చరిస్తున్నారు.

Pension Fraud: పెన్షన్ పేరుతో నయా మోసం.. మృతి చెందిన తండ్రి పేరుతో..

అయితే.. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం కేఎల్ భరత్‌కే మద్దతు తెలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తాను ఎంపిక చేసిన టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్‌లో.. ఇషాన్‌ని కాకుండా కేఎస్ భరత్‌కు చోటు ఇచ్చాడు. అంతేకాదు.. తాను ఎంపిక చేసిన జట్టుతో భారత్ మైదానంలోకి దిగితే, ఆస్ట్రేలియాపై తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తాను ఎంపిక చేసిన ప్లేయింగ్‌ ఎలెవన్‌లో.. ఓపెనర్లుగా శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మకు గవాస్కర్ అవకాశం ఇచ్చాడు. అలాగే.. పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, అజింక్యా రహానె ఐదో స్థానంలో బ్యాటింగ్‌ వస్తే బాగుంటుందని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. భరత్‌కు ఆరో స్ధానంలో చోటు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశమిచ్చిన గవాస్కర్.. చివరగా ఫాస్ట్‌ బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు ఛాన్స్‌ ఇచ్చాడు.

Allu Arjun : స్నేహారెడ్డి అంటే అల్లు అర్జున్ అమ్మకు అస్సలు ఇష్టం లేదా?

Show comments