Site icon NTV Telugu

Kusal Mendis: అత్యంత చెత్త రికార్డ్.. టోటల్‌గా 26

Kusal Mendis Worst Record

Kusal Mendis Worst Record

Sri Lankan Cricketer Kusal Mendis Creates Worst Record In International Cricket: శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో కలిపి అతడు ఇప్పటివరకూ 26 సార్లు డకౌట్ అయ్యాడు. ఫలితంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో జానీ బెయిర్ స్టో (ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. 25 డకౌట్లతో మొయిన్ అలీ (ఇంగ్లండ్) మూడో స్థానంలో ఉండగా.. 23 డకౌట్లతో కగిసో రబాడా (సౌతాఫ్రికా) నాలుగో స్థానంలో ఉన్నాడు. కుశాల్ మెండిస్ మరో రెండు సార్లు డకౌట్ అయితే.. బెయిర్ స్టోని అధిగమించి, అగ్రస్థానంలో నిలుస్తాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. రాజపక్స ఆడిన విధ్వంసకరమైన ఇన్నింగ్స్ పుణ్యమా అని 170 పరుగులు చేయగలిగింది. అటు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా చేతికి అందివచ్చిన రెండు క్యాచ్‌లు వదులుకొని, అతనికి లైఫ్ ఇచ్చారు. నిజానికి.. మొదటి పది ఓవర్లను పాక్ బౌలర్లు పటిష్టంగా వేశారు. ఐదు వికెట్లు తీసి, కేవలం 67 పరుగులే ఇచ్చారు. కానీ, ఆ తర్వాతే పరిస్థితులు తేడా కొట్టేశాయి. రాజపక్సకి అవకాశాలు ఇవ్వడంతో, అతడు చెలరేగిపోయాడు. అటు.. లక్ష్య చేధనకు దిగిన పాక్ బ్యాటర్లు సైతం సత్తా చాటుకోలేకపోయారు. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (55), మిడిలార్డర్‌లో వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ (31) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దాంతో 147 పరుగులకే పాక్ జట్టు కుప్పకూలింది.

Exit mobile version