NTV Telugu Site icon

Sri Lanka vs Ireland: శ్రీలంక అతి భారీ విజయం.. గత రికార్డ్ బద్దలు

Srilanka Test Record

Srilanka Test Record

Sri Lanka Creates History In Test Format By Winning With Huge Margin On Ireland: టెస్టుల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో.. ఒక ఇన్నింగ్స్‌తో పాటు 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఇంతకుముందు 2004లో జింబాబ్వేపై శ్రీలంక ఒక ఇన్నింగ్స్‌తో పాటు 254 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన రికార్డ్‌ని తానే బద్దలుకొట్టుకుంది శ్రీలంక. అయితే.. ఓవరాల్‌గా టెస్టుల్లో మాత్రం అతి భారీ విజయం​ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉంది. 1938లో ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ ఒక ఇన్నింగ్స్‌‌తో పాటు 579 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకూ ఇది చెరగని రికార్డ్‌గా మిగిలిపోయింది.

Ralph Paul Yarl Case: పొరపాటున పక్కింటి డోర్‌బెల్ మోగించాడు.. వెంటనే తుపాకీ తీసి..

ఇక శ్రీలంక, ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. కేవలం మూడు రోజుల్లోనే ఇది ముగిసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో శ్రీలంక అద్భుతంగా రాణించి.. పసికూనపై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 597 పరుగులు చేసి, డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (179), కుశాల్‌ మెండిస్‌ (140), దినేశ్‌ చండీమాల్‌ (102 నాటౌట్‌), సమరవిక్రమ (104 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి దిగిన ఐర్లాండ్ జట్టు.. 143 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 168 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా.. శ్రీలంక జట్టు ఒక ఇన్నింగ్స్‌తో పాటు 280 పరుగుల భారీ తేడాతో విజయం కైవసం చేసుకుంది.

Horrible Femicide: సేద తీరడానికి బీచ్‌కి వెళ్లారు.. దారుణ హత్యకు గురయ్యారు

ఈ మ్యాచ్‌లో జయసూర్య ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన అతగాడు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఇప్పటివరకూ కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడిన జయసూర్య.. మొత్తంగా 43 వికెట్లు సాధించడంతో పాటు రెండు సార్లు 10 వికెట్లు, ఐదు సార్లు 5 వికెట్ల ఘనతను సాధించాడు. ఇదే మ్యాచ్‌లోనే రమేశ్ మెండిస్ సైతం తన పేరిట ఒక రికార్డ్ లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతగాడు.. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.