Site icon NTV Telugu

Markram: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్‌కు కొవిడ్

Markram

Markram

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్‌క్రమ్‌ కరోనా బారిన పడ్డారు. జట్టు సభ్యులకు కొవిడ్-19 టెస్ట్‌లు జరపగా.. అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో గురువారం భారత్‌తో జరుగుతున్న సిరీస్ తొలి టీ20 మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2022లో సన్ రైజర్స్ తరఫున ఐడెన్ మార్‌క్రమ్ ఆడిన సంగతి తెలిసిందే. మార్‌క్రమ్ జూన్ 2న ఇండియాకు వచ్చాడు. టీమ్‌కు రెగ్యులర్‌గా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అతనికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతవారందరికీ నెగెటివ్ వచ్చింది.

IND Vs SA: భారత బౌలర్ల వైఫల్యం.. తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఘనవిజయం

ఇక తొలి టీ20 కోసం టాస్‌ వేశాక దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా తమ జట్టు కూర్పు గురించి చెబుతూ ఈ విషయం తెలిపాడు. మార్‌క్రమ్‌ స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టాన్‌ స్టబ్స్‌కు తొలిసారిగా జట్టులో అవకాశమిచ్చారు. మరోవైపు దేశంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయనే ఆలోచనలో బీసీసీఐ ఈసారి టీ20 సిరీస్‌ను బయోబబుల్‌ లేకుండానే ఆడిస్తోంది. ఈనేపథ్యంలో మార్‌క్రమ్‌ ఉదంతంతో రెండు జట్ల టీమ్‌ మేనేజ్‌మెంట్స్‌ ఆందోళనలో పడినట్టయింది.

Exit mobile version