Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
- భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్
- సోఫీ ఎక్లెస్టోన్ ఫీల్డింగ్ తప్పిదం
- సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ చేసిన ఫీల్డింగ్ తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఇది నిజంగా అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిందా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది.
ఇంగ్లండ్ తరఫున బౌలింగ్ చేసిన సోఫీ ఎక్లెస్టోన్.. భారత బ్యాటర్ రిచా ఘోష్‌కు యార్కర్ బంతిని వేసింది. బంతిని ఆడిన రిచా ఒక పరుగు కోసం ప్రయత్నించగా.. సులభంగా రన్ఔట్ చేసే అవకాశం ఎక్లెస్టోన్‌కు లభించింది. అయితే వికెట్లకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికీ.. ఆమె వేసిన త్రో స్టంప్స్‌ను తాకకుండా పక్కకు వెళ్లిపోయింది. దీంతో అప్పటికే రన్ఔట్ అయ్యానని భావించి నెమ్మదించిన రిచా.. మళ్లీ పరుగెత్తి ఓవర్‌త్రో రూపంలో మరో పరుగు కూడా సాధించింది. ఈ ఘటన తర్వాత సోఫీ ఎక్లెస్టోన్ కూడా నవ్వును ఆపుకోలేకపోయింది.
Also Read
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
సోఫీ ఎక్లెస్టోన్ త్రో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఇది గల్లీ క్రికెట్‌ను గుర్తు చేసింది’ అంటూ పలువురు అభిమానులు సరదాగా కామెంట్స్ చేశారు. మరికొందరు ‘ఇలాంటి ఘటనను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయింది.
What on earth did I just witness? 🤣 pic.twitter.com/xgOcbtHZ2f
— Out Of Context Cricket (@GemsOfCricket) June 3, 2026
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?