Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
మంధాన ఈ రికార్డును అత్యంత వేగంగా అందుకోవడం విశేషం. కేవలం 112 ఇన్నింగ్స్‌లలోనే 5 వేల పరుగులు పూర్తి చేసి భారత మహిళా క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె ఆస్ట్రేలియాపై ప్రత్యేకమైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై మొత్తం 10 హాఫ్ సెంచరీలు సాధించిన మంధాన, కంగారూ బౌలర్లను వరుసగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ టీమిండియాకు బలాన్నిస్తోంది.
ఆమె ప్రదర్శనతో భారత జట్టు వరల్డ్‌కప్‌లో మంచి ఊపునందుకుంది. స్మృతి మంధాన రికార్డు సాధించిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు, క్రికెట్ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. టీమిండియాకు మంధాన లాంటి ఆటగాళ్లే గొప్ప గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. మహిళా క్రికెట్ ప్రపంచంలో కొత్త మైలురాయిల దిశగా స్మృతి మంధాన దూసుకెళ్తుండటం భారత అభిమానులకు గర్వకారణంగా మారింది.
Principal Assaults YouTuber: యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ దాడి…ఎందుకంటే…
