Shubman Gill Turns Uncle For Virat Kohli Son Akaay: భారత క్రికెట్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ, ‘ప్రిన్స్’ శుభ్‌మన్ గిల్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీని తనకు ఆదర్శం, మార్గదర్శి అని గిల్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. తాజాగా కోహ్లీ కుమారుడు అకాయ్‌పై రూపొందిన ఓ సరదా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో గిల్ కూడా భాగమయ్యాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ కంటెంట్ క్రియేటర్ అకాయ్ స్కూల్ టీచర్‌గా నటిస్తూ.. ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. ఎవరు అరిచేది అంటూ.. అకాయ్‌ను టీచర్ మందలిస్తుంది. అంతేకాకుండా మరుసటి రోజు తల్లిదండ్రులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మను స్కూల్‌కు తీసుకురావాలని అకాయ్‌కు చెబుతుంది. ఇక్కడితో ఆగకుండా.. అకాయ్ మీ అంకుల్ శుభ్‌మన్ గిల్‌ను కూడా వెంట తీసుకురావాలని సదరు టీచర్ చెబుతుంది. అందుకు అకాయ్ ఓకే మేడం అని చెబుతాడు.
ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన శుభ్‌మన్ గిల్ తెగ నవ్వుకున్నాడు. విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ.. ‘భాయ్ డోంట్ వర్రీ, ఐ గాట్ యూ కవర్డ్’ అంటూ కామెంట్ చేశాడు. ‘బ్రదర్.. నువ్వేమీ టెన్షన్ పడొద్దు, నేను చూసుకుంటా’ అని గిల్ పోస్ట్ చేశాడు. గిల్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ వీడియోపై మీమ్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ, గిల్ మధ్య ఉన్న సోదరభావం, ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధాన్ని ఈ సరదా వీడియో మరోసారి చూపించిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
విరాట్ కోహ్లీతో శుభ్‌మన్ గిల్‌కు ఉన్న అనుబంధం గురించి క్రికెట్ అభిమానులకు తెలుసు. కోహ్లీని సీనియర్‌గా మాత్రమే కాకుండా తన కెరీర్‌లో స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా గిల్ భావిస్తుంటాడు. అందుకే అకాయ్‌కు సంబంధించిన ఈ సరదా వీడియోలో గిల్‌ను ‘అంకుల్’గా ప్రస్తావించడం అభిమానులకు మరింత వినోదాన్ని పంచింది. ఇక కోహ్లీ, గిల్ త్వరలోనే మరోసారి భారత వన్డే జట్టు తరఫున కలిసి ఆడనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోనున్నారు.
He ain’t gonna reply Gill bro 😭 pic.twitter.com/rJsNktEJ6l
— Sohel. (@SohelVkf) September 3, 2026

