Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
- తీవ్రంగా నిరాశపరుస్తోన్న భారత జట్టు
- అరుదైన జాబితాలో 'సర్పంచ్ సాబ్'
- 25 పరుగులు దాటని మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో దారుణ ఓటమిని ఎదుర్కొంది. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన పోరాట పటిమతో ఆకట్టుకుంటున్నాడు. గురువారం బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్ 158/7 స్కోరు చేయగా.. ‘సర్పంచ్ సాబ్’ ఒంటరి పోరాటంతో అజేయంగా 80 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరినా.. శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో శ్రేయస్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
భారత్ తరఫున టీ20ల్లో జట్టులోని ఏ బ్యాటర్ కూడా 25 పరుగులు దాటని మ్యాచ్‌ల్లో.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌పై చేసిన 80 పరుగులతో సర్పంచ్ సాబ్ ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ తర్వాత అత్యధిక స్కోరు 22 పరుగులే కావడం విశేషం. కఠిన పరిస్థితుల్లో ఒంటరిగా జట్టును ముందుకు నడిపించడం శ్రేయస్ ఇన్నింగ్స్ విలువను మరింత పెంచింది.
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ఈ ప్రత్యేక జాబితాలో మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానంలో ఉన్నాడు. అమెరికాపై సూరీడు అజేయంగా 84 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లలో అత్యధిక స్కోరు 25 మాత్రమే. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న కింగ్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాపై 82 పరుగులు బాదాడు. ఆ మ్యాచ్‌లో మరో బ్యాటర్ 21 పరుగులకు మించి చేయలేదు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌పై చేసిన 80 రన్స్ ఈ అరుదైన జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు మొత్తం మూడు సార్లు ఉంది. ఇంగ్లండ్‌పై 80 పరుగులతో పాటు శ్రీలంకపై చేసిన అజేయ 73 పరుగులు, మరోసారి ఇంగ్లండ్‌పైనే చేసిన 67 పరుగుల ఇన్నింగ్స్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అంటే జట్టు మొత్తం విఫలమైన సందర్భాల్లో కూడా బాధ్యత తీసుకుని పోరాడే బ్యాటర్‌గా శ్రేయస్ తన విలువను నిరూపించుకున్నాడు.
భారత్ తరఫున టీ20ల్లో మిగతా బ్యాటర్లు 25 పరుగులు దాటని మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
84* – సూర్యకుమార్ యాదవ్ vs USA (తదుపరి అత్యధిక స్కోరు: 25)
82* – విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా ( తదుపరి అత్యధిక స్కోరు: 21)
80* – శ్రేయస్ అయ్యర్ vs ఇంగ్లండ్ (తదుపరి అత్యధిక స్కోరు: 22)
79* – రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా (తదుపరి అత్యధిక స్కోరు: 13)
77* – విరాట్ కోహ్లీ vs ఇంగ్లండ్ (తదుపరి అత్యధిక స్కోరు: 25)
73* – శ్రేయస్ అయ్యర్ vs శ్రీలంక (తదుపరి అత్యధిక స్కోరు: 22)
68 – సూర్యకుమార్ యాదవ్ vs దక్షిణాఫ్రికా (తదుపరి అత్యధిక స్కోరు: 15)
67 – శ్రేయస్ అయ్యర్ vs ఇంగ్లండ్ (తదుపరి అత్యధిక స్కోరు: 21)
60 – యువరాజ్ సింగ్ vs ఆస్ట్రేలియా (తదుపరి అత్యధిక స్కోరు: 24)
తాజావార్తలు
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?