Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్‌ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
- శ్రేయస్ కెప్టెన్సీలో 7 మ్యాచ్‌ల్లో 6 ఓటములు
- ఇంగ్లండ్ సిరీస్‌ను 0-4తో కోల్పోయిన భారత్
- ఐర్లాండ్ సిరీస్‌ను 0-2తో కోల్పోయిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Captaincy: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రయాణం అత్యంత నిరాశాజనకంగా ప్రారంభమైంది. అతడి కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరు ఓటములు ఎదుర్కొంది. శనివారం రాత్రి సౌతాంప్టన్‌లో జరిగిన ఐదో టీ20లో ఇంగ్లండ్ చేతిలో 56 పరుగుల తేడాతో ఓడిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది.
అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు ఫలితాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అతడి నాయకత్వంలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో భారత్ ఆరు ఓటములు ఎదుర్కొంది. ఈ వరుస పరాజయాలతో శ్రేయస్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ఎంపిక, ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోకపోవడం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘోర ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఈ ఘోర పరాజయం భారత జట్టు టీ20 ర్యాంకింగ్స్పైనా ప్రభావం చూపింది. సుమారు 1601 రోజులుగా ఐసీసీ టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో కొనసాగించిన అగ్రస్థానం కూడా చేజారింది. గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌కు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలు భారీ ఎదురుదెబ్బగా మారాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత పరిస్థితుల్లో, చిన్న బౌండరీల మధ్య దూకుడు మంత్రాన్ని విదేశీ పరిస్థితుల్లోనూ అమలు చేయడం ఫలించలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ పర్యటన మరోసారి స్పష్టం చేసింది.
వరుసగా జట్టులో మార్పులు చేయడం వల్ల ఆటగాళ్లలో అభద్రత పెరుగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, గౌతమ్ గంభీర్ కోచింగ్ వ్యూహాలు, జట్టు ఎంపికపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో ప్రారంభమైన శ్రేయస్ కెప్టెన్సీ ప్రయాణం.. రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. బీసీసీఐ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!