Shreyas Iyer Breaks MS Dhoni Toss Record: టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా వరుసగా అత్యధికసార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్ రికార్డుల్లోకి ఎక్కాడు. గురువారం జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఖాతాలో ఈ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ సారథి కూడా తన తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ గెలవలేదు.
ఇప్పటివరకు ఈ రికార్డు బహామాస్ మాజీ కెప్టెన్ గ్రెగరీ టేలర్ పేరిట ఉంది. టేలర్ వరుసగా ఏడు టాస్‌లు గెలిచాడు. టేలర్ రేర్ రికార్డును ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ బద్దలు కొట్టాడు. భారత కెప్టెన్లలో కూడా శ్రేయస్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు టీ20ల్లో వరుసగా అత్యధిక టాస్‌లు గెలిచిన భారత కెప్టెన్‌గా క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఉన్నాడు. ధోనీ 2010 మే నుంచి 2012 ఫిబ్రవరి మధ్య వరుసగా ఏడు టాస్‌లు గెలిచి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు శ్రేయస్ వరుసగా ఎనిమిది టాస్‌లు గెలిచి ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ వరుసగా ఆరు టాస్‌లు గెలిచాడు.
మరోవైపు పూర్తి సభ్యత్వ దేశాల్లో అత్యధికసార్లు టాస్ గెలిచిన కెప్టెన్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ (10) అగ్ర స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (9) రెండో స్థానంలో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ (8) మూడో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే గడ్డపై భారత్ మరో రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విదేశీ గడ్డపై అత్యధిక మంది ఆటగాళ్లకు అరంగేట్రం అవకాశం ఇచ్చిన దేశంగా నిలిచింది. ఇప్పటివరకు 31 మంది భారత ఆటగాళ్లు జింబాబ్వేలో టీ20 అరంగేట్రం చేశారు. జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌లో పేసర్ అశోక్ శర్మ కూడా భారత్ తరఫున తొలి టీ20 ఆడాడు.
టీ20ల్లో వరుసగా అత్యధిక టాస్ గెలిచిన భారత కెప్టెన్లు:
శ్రేయస్ అయ్యర్ – 8 (2026)
ఎంఎస్ ధోనీ – 7 (2010-12)
విరాట్ కోహ్లీ – 6 (2019)
ఎంఎస్ ధోనీ – 5 (2007)
రోహిత్ శర్మ – 5 (2020-22)

