Site icon NTV Telugu

Shoaib Akhtar Emotional Video: చాలా నొప్పిగా ఉంది.. పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ ఎమోషనల్ వీడియో

Shoaib Akhtar

Shoaib Akhtar

Shoaib Akhtar Emotional Video: పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ ఎమోషనల్ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అక్తర్‌ ఇటీవలే మోకాళ్ల సర్జరీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న అక్తర్‌ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వీడియోతో తన బాధను పంచుకున్నాడు. మోకాళ్ల ఆపరేషన్‌ అనంతరం చాలా నొప్పిగా ఉందని.. త్వరగా కోలుకోవడానికి మీ దీవెనలు కావాలంటూ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఎమోషనల్ వీడియో ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి 11 ఏళ్లు గడుస్తున్నా.. ఈ నొప్పితో ఇంకా ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

PV Sindhu: వెల్‌డన్ సింధు.. డేవిడ్ వార్నర్‌ స్పెషల్ విషెస్

స్పీడ్‌ బౌలింగ్‌ వల్ల ఎముకలు అరిగిపోతాయి… తీవ్రమైన నొప్పి భరించాల్సి ఉంటుంది.. అయినా పాకిస్థాన్‌ కోసం మరోసారి ఆడమన్నా ఆడతానన్నారు. ఇప్పటికే నాలుగైదు చిన్న చిన్న ఆపరేషన్లు అయ్యాయని… బహుషా ఇదే చివరి సర్జరీ అవుతుందేమోనని అక్తర్ వెల్లడించారు. ఆ వీడియోలో అక్తర్ మాట్లాడుతూ.. ”11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నా. వాస్తవానికి క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే మోకాలి నొప్పితో మరో నాలుగైదేళ్లు ఆడి ఉంటే మాత్రం కచ్చితంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యేవాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలు నేను తొందరగా కోలుకునేలా చేస్తాయని ఆశిస్తున్నా. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా” అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం అక్తర్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Exit mobile version