Site icon NTV Telugu

Pakistan PM: పరువు తీసుకోవడమే పాక్ ప్రధాని పని.. ఈసారి ఏం చేశాడంటే..

Pak Pm

Pak Pm

Pakistan PM: పాకిస్తాన్ రాజకీయ నాయకులు పరువు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా, ఆయన ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపుపై సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు పాక్ పీఎంను ఒక ఆట ఆడుకుంటున్నారు. మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా షరీఫ్ పోస్ట్‌పై సెటైర్లు వేశారు. ‘‘ఆస్ట్రేలియా -బీ టీమ్’’పై గెలవడంలో గొప్పేంటి అని ప్రశ్నించారు.

Read Also: Katasani Ram Bhupal Reddy: పవన్ కల్యాణ్‌పై కాటసాని హాట్ కామెంట్స్..

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి టి20ఐలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు టీమ్ పాకిస్తాన్‌కు అభినందనలు. పాకిస్తాన్ క్రికెట్‌ను బలోపేతం చేయడంలో అవిశ్రాంత కృషి చేసినందుకు చైర్మన్ పిసిబి చీఫ్ మొహ్సీన్ నఖ్వీ మరియు అతని మొత్తం జట్టును కూడా నేను అభినందిస్తున్నాను. దేశానికి గర్వకారణమైన క్షణం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీంలోని కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడటం లేదని, 170 పరుగుల ఆటలో 20 రన్స్ తేడాతో విజయం సాధించడం పెద్ద గొప్ప కాదని ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టీంలో కీలమైన ఐదుగురు ఆటగాళ్లు లేకుండా పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్ నేతృత్వంలో ఆసీస్ బీ టీమ్ పాక్‌లో ఆడుతోంది. తొలి టీ20లో పాక్ 168/8 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 146/8కి పరిమితమైంది. కేవలం 22 పరుగుల తేడాతో గెలవడం పెద్ద గెలుపు, దేశానికి గర్వకారణం కాదని ఆకాష్ చోప్రా చెప్పారు.

Exit mobile version