Site icon NTV Telugu

Shane Warne: ఆస్ట్రేలియా చేరుకున్న వార్న్ డెడ్ బాడీ.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

ఆస్ట్రేలియా లెజెండ‌రీ స్పిన్నర్ షేన్‌వార్న్ ఈనెల 4న థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో రోజుల తర్వాత వార్న్ డెడ్‌బాడీ ప్రత్యేక విమానం ద్వారా గురువారం నాడు థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకుంది. శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. థాయ్‌లాండ్‌లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్‌బోర్న్‌కు డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో షేన్‌వార్న్ మృతదేహాన్ని థాయ్ ప్రభుత్వం త‌ర‌లించింది.

కాగా ప్రభుత్వ లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు ఈ నెల 30న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్నాయి. వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యే వారి కోసం టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఈ మేరకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. మరోవైపు వార్న్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు అతడిది సహజమరణమేనని, తమకు ఎలాంటి అనుమానాలు లేవని థాయ్‌లాండ్ పోలీసులు స్పష్టం చేశారు.

Exit mobile version