NTV Telugu Site icon

Shakib Al Hasan: చరిత్ర సృష్టించిన షకీబ్.. తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా..

Shakib Creates History

Shakib Creates History

Shakib Al Hassan Creates History: బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే వైట్ బాల్ క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా చెలామణీ అవుతున్న షకీబ్.. లేటెస్ట్‌గా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. చట్టోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రెహాన్ అహ్మద్ వికెట్‌ని పడగొట్టడం ద్వారా.. షకీబ్ ఈ 300 వికెట్ల మార్క్‌ని సాధించాడు. పలితంగా.. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబ్ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 200 వన్డే వికెట్ల మైల్‌స్టోన్‌ని అందుకున్నారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్‌ రజాక్‌ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు షకీబ్ 227 వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి బంగ్లా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Turkey Earthquake: టర్కీ భూకంప నష్టాన్ని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. ఎంతంటే?

ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బంతితోపాటు బ్యాట్‌తోనూ చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లోనే 75 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితా ప్రకారం చూసుకుంటే.. షకీబ్ 14వ స్థానంలో ఉన్నాడు. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ 534 వికెట్లతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత వసీం అక్రమ్ 502 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వకార్‌ యూనిస్‌ (416), చమిందా వాస్‌ (400), షాహిద్‌ అఫ్రిది (395), షాన్‌ పొలాక్‌ (393), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (381), బ్రెట్‌ లీ (380), లసిత్‌ మలింగ (338), అనిల్‌ కుంబ్లే (337), సనత్‌ జయసూర్య (323), జవగల్‌ శ్రీనాథ్‌ (315), డేనియల్‌ వెటోరీ (305), షకీబ్‌ అల్‌ హసన్‌ (300), షేన్‌ వార్న్‌ (293) మొదలైన ఆటగాళ్లు వరుసగా 3 నుంచి 15వ స్థానాల్లో ఉన్నారు.

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి.. కవిత పిలుపు

బంగ్లా, ఇంగ్లండ్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్‌ రహీమ్‌ (70), షకీబ్‌ (75) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సామ్‌ కర్రన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో 2 వికెట్లు, క్రిస్‌ వోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ పొందారు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌటైంది. దీంతో.. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.