Shakib Al Hasan: చరిత్ర సృష్టించిన షకీబ్.. తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hassan Creates History: బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే వైట్ బాల్ క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా చెలామణీ అవుతున్న షకీబ్.. లేటెస్ట్‌గా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. చట్టోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రెహాన్ అహ్మద్ వికెట్‌ని పడగొట్టడం ద్వారా.. షకీబ్ ఈ 300 వికెట్ల మార్క్‌ని సాధించాడు. పలితంగా.. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబ్ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 200 వన్డే వికెట్ల మైల్‌స్టోన్‌ని అందుకున్నారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు షకీబ్ 227 వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి బంగ్లా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Turkey Earthquake: టర్కీ భూకంప నష్టాన్ని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. ఎంతంటే?
Also Read
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బంతితోపాటు బ్యాట్‌తోనూ చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లోనే 75 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితా ప్రకారం చూసుకుంటే.. షకీబ్ 14వ స్థానంలో ఉన్నాడు. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ 534 వికెట్లతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత వసీం అక్రమ్ 502 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వకార్ యూనిస్ (416), చమిందా వాస్ (400), షాహిద్ అఫ్రిది (395), షాన్ పొలాక్ (393), గ్లెన్ మెక్‌గ్రాత్ (381), బ్రెట్ లీ (380), లసిత్ మలింగ (338), అనిల్ కుంబ్లే (337), సనత్ జయసూర్య (323), జవగల్ శ్రీనాథ్ (315), డేనియల్ వెటోరీ (305), షకీబ్ అల్ హసన్ (300), షేన్ వార్న్ (293) మొదలైన ఆటగాళ్లు వరుసగా 3 నుంచి 15వ స్థానాల్లో ఉన్నారు.
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి.. కవిత పిలుపు
బంగ్లా, ఇంగ్లండ్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్ రహీమ్ (70), షకీబ్ (75) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు, క్రిస్ వోక్స్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ పొందారు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌటైంది. దీంతో.. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!