NTV Telugu Site icon

BPL 2023: 18 బాల్స్‌లో 73 రన్స్.. ఇదెక్కడి మాస్‌రా బాబు!

Shakib Ifthiker Bpl

Shakib Ifthiker Bpl

Shakib Al Hasan and Iftikhar Ahmed record highest ever fifth wicket partnership: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌-2023లో ఫార్చూన్ బరిషల్ బ్యాటర్లు షకిబుల్ హసన్, ఇఫ్తికర్ అహ్మద్ విధ్వంసం సృష్టించారు. దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ ఫ్యాన్స్‌కు అసలు సిసలు టీ20 మజా అందించారు. బీపీఎల్‌లో భాగంగా రంగాపూర్‌ రైడర్స్-ఫార్చూన్ బరిషల్‌ మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఊచకోతకు వేదికైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఫార్చూన్‌ 46 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన షకిబుల్, ఇఫ్తికర్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశారు.

Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్

ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడిన షకిబుల్, అహ్మద్ ఐదో వికెట్‌కు టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక భాగస్వామ్యం (192) నెలకొల్పి రికార్డు సృష్టించారు. 2020లో ఆడమ్ హోస్, డాన్ మౌస్లీ పేరిట ఉన్న 171 రన్స్ భాగస్వామ్య రికార్డును వీరు తిరగరాశారు. ఇందులో ఇఫ్తికార్ 45 బంతుల్లోనే సెంచరీతో అదరగొట్టగా.. 43 బంతుల్లో 89 రన్స్‌తో షకిబుల్ విరుచుకుపడ్డాడు. దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 238 4 భారీ స్కోర్ చేసింది. కాగా చివరి 3 ఓవర్లలో వీరు విశ్వరూపం చూపించారు. దీంతో లాస్ట్ 18 బంతుల్లో 73 రన్స్ లభించడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రంగాపూర్ జట్టు 20 ఓవర్లలో 171/9 స్కోర్‌కే పరిమితం కావడంతో ఫార్చూన్‌ 67 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది.

Ex-Husband Crime: మరో వ్యక్తితో మహిళ రాసలీలలు.. తట్టుకోలేక భర్త కిరాతక పని