NTV Telugu Site icon

Shaheen Afridi 4 Wickets: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన అఫ్రిది.. వైరల్ వీడియో!

Shaheen Afridi

Shaheen Afridi

Pakistani pacer Shaheen Shah Afridi 1st Bowler To Take 4 Wickets In First Over: టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో నాలుగు వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 బ్లాస్ట్‌ 2023లో అఫ్రిది ఈ రికార్డు నెలకొల్పాడు. నాటింగ్‌హమ్‌ తరఫున ఆడుతున్న అఫ్రిది.. వార్విక్‌షైర్‌పై 4 వికెట్స్ తీశాడు. అఫ్రిది దెబ్బకు వార్విక్‌షైర్‌ తొలి ఓవర్‌లో 7 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 7 పరుగులలో 5 రన్స్ అదనపు పరుగులే ఉండడం విశేషం.

టీ20 క్రికెట్‌లో ఓ బౌలర్‌ తొలి ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. అయితే వన్డే క్రికెట్‌లో శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్‌ ఈ ఘనత సాధించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్‌ కూడా ఉంది. దాదాపు 20 సంవత్సరాలు అయినా వాస్ రికార్డును ఎవరూ అందుకోలేదు. తాజాగా టీ20ల్లో షాహీన్‌ షా అఫ్రిది ఈ రికార్డు నెలకొల్పాడు. 2006లో పాకిస్తాన్‌పై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ టెస్ట్ తొలి ఓవర్‌లో హ్యాట్రిక్‌ తీశాడు.

Also Read: Shreyanka Patil CPL: చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

షాహీన్‌ షా అఫ్రిది వేసిన తొలి బంతి​ వైడ్ కాగా.. బౌండరీ కూడా వెళ్లింది. దాంతో 5 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి అలెక్స్‌ డేవిస్‌ (0) ఎల్బీడబ్ల్యూ కాగా.. రెండో బంతికి బెంజమిన్‌ (0) బౌల్డ్‌ అయ్యాడు. 3, 4 బంతులకు సింగల్స్‌ వచ్చాయి. ఇక ఐదో బంతికి మౌస్లే (1) క్యాచ్‌ ఔటయ్యాడు. చివరి బంతికి బర్నార్డ్‌ (0) బౌల్డయ్యాడు. దాంతో అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో మొత్తం 4 వికెట్లు వచ్చాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్ అఫ్రిదిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన నాటింగ్‌హమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. టామ్‌ మూర్స్‌ (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లింటాట్‌, హసన్‌ అలీ తలో 3 వికెట్లు పడగొట్టారు. లక్ష ఛేదనలో షాహీన్‌ అఫ్రిది దెబ్బకు తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు కోల్పోయిన వార్విక్‌షైర్‌.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. రాబర్ట్‌ ఏట్స్‌ (65), జేకబ్‌ బెథెల్‌ (27), జేక్‌ లింటాట్‌ (27 నాటౌట్‌) రాణించడంతో 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Also Read: Ravindra Jadeja Rapid Fire: టీమిండియాలో బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!